శ్రీ రేణుక ఎల్లమ్మ ఫిలిం స్టూడియో ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం విడుదల
నూతన హారర్ చిత్రం ‘కన్య ఒక ఆత్మకథ’లో నటీనటులకు అవకాశంరంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ నవంబర్ 01(ప్రజాక్షేత్రం)కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, మానవీయ విలువలను ప్రతిబింబించేలా రూపొందించిన నూతన లఘు చిత్రం ‘మన బంధం’ విడుదలైంది. శ్రీ రేణుక ఎల్లమ్మ ఫిలిం స్టూడియో ఆధ్వర్యంలో, ఎంఎస్ ముచ్చట్లు ఛానల్లో రూపొందించిన ఈ చిత్ర విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ నవంబర్ 01(ప్రజాక్షేత్రం)కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, మానవీయ విలువలను ప్రతిబింబించేలా రూపొందించిన నూతన లఘు చిత్రం ‘మన బంధం’ విడుదలైంది. శ్రీ రేణుక ఎల్లమ్మ ఫిలిం స్టూడియో ఆధ్వర్యంలో, ఎంఎస్ ముచ్చట్లు ఛానల్లో రూపొందించిన ఈ చిత్ర విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వడ్డె రాఘవేందర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో కుటుంబ బంధాలకు, మానవీయ విలువలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, కుటుంబ సభ్యుల అనుబంధాలను ప్రేక్షకులకు తెలియజేయాలనే సంకల్పంతో ‘మన బంధం’ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ లఘు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, తమ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నటీనటులు రాపోలు లింగస్వామి, మల్లేష్ ముదిరాజ్, ఎండీ అన్వర్, ఆనంద్, శరణ్య, సౌజన్య, రమాదేవి, ఛాయాగ్రాహకుడు నవీన్ కుమార్, గ్రాఫిక్స్ ఎడిటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నూతన నటీనటులకు ఆహ్వానం
ఇదే సందర్భంగా దర్శకుడు వడ్డె రాఘవేందర్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన చిత్రీకరణ ప్రారంభించనున్న ‘కన్య ఒక ఆత్మకథ’ అనే హారర్ చిత్రంలో నటించేందుకు నూతన నటీనటులు అవసరమని తెలిపారు. నటనపై ఆసక్తి, అభిరుచి ఉన్న యువతీ యువకులకు తమ చిత్రంలో అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 6301766746 నంబర్‌ను సంప్రదించాలని దర్శకుడు వడ్డె రాఘవేందర్ కోరారు.