గోశాలకు గడ్డి తరలించిన బస్వాపూర్ సర్పంచ్ శ్రీధర్

ధన్యవాదాలు తెలిపిన గోశాల నిర్వాహకులు, ప్రజలు కోటగిరి నవంబర్ 01(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పుట్టా శ్రీధర్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని ఏకచక్ర గోశాలకు ఆదివారం పశు గ్రాసాన్ని తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుట్టా శ్రీధర్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలను కట్టించి బోధన్ పట్టణంలోని ఏకచక్ర గోశాలకు తరలించినట్లు చెప్పారు. అలాగే తమ గ్రామానికి చెందిన 9 దేవుని ఆవులను ఏక చక్ర గోశాలకు పంపించినట్లు ఆయన...