మున్నూరు కాపుల ఐక్యతకు డిజిటల్ విప్లవం!

సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం ఆన్‌లైన్‌లో సభ్యత్వం.. ఓటర్ ఐడీ కార్డు పొందే అవకాశం కోటగిరి, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):మున్నూరు కాపుల ఐక్యత, సంఘటిత శక్తి, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యత్వ నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను వేములవాడలో ఆవిష్కరించారు. వేములవాడలోని రాజరాజేశ్వరి మున్నూరు కాపు సత్రంలో నిర్వహించిన తెలంగాణ మున్నూరుకాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర ఎన్నికల సమావేశానికి బోధన్ ప్రాంతానికి చెందిన సంఘ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా...