సారపాక కోలాట బృందానికి డబుల్ ధమాకా!

ఇండియన్ గ్లోరీ అవార్డ్స్–2026లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు.. ప్రముఖ సినీ హీరో సుమన్ చేతుల మీదుగా అవార్డుల స్వీకరణ బూర్గంపహాడ్, నవంబర్ 01 (ప్రజా క్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన శ్రీ కృష్ణం వందే జగద్గురుం కోలాట బృందం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ గ్లోరీ అవార్డ్స్–2026 వేడుకల్లో ఒకే వేదికపై రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుని సారపాక ప్రాంత కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటింది.అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కళారత్న మూవీస్, రాజు ఎంటర్‌టైనర్స్...