హైదరాబాద్ నవంబర్ 02(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు జరిగే బీజేపీ పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం బేగంపేట చేరుకున్నాక భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసి, హోటల్‌లో ప్రముఖులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.15 గంటలకు పాదయాత్రలో పాల్గొని, అనంతరం ఎంజే మార్కెట్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.