గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై కాంగ్రెస్లో ఆశావహుల హడావుడి
మూడు స్థానాలు.. 30 మందికి పైగా పోటీ. సామాజిక సమీకరణాలే కీలకం? హైదరాబాద్ నవంబర్ 04(ప్రజాక్షేత్రం):తెలంగాణలో గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ చర్చకు తెరలేపాయి. పదవుల కోసం పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మూడు స్థానాలకు 30 మందికి పైగా నాయకులు ఆశలు పెట్టుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం చేసిన సేవలు, రాజకీయ ప్రాధాన్యతలను పరిగణనలోకి...