చెత్తలో కూర్చుని కౌన్సిలర్ నిరసన..
కామారెడ్డి నవంబర్ 04(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత పట్టణ ప్రాంతంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ అధికారులు చెత్త డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని 46, 47 వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కౌన్సిలర్ లక్ష్మీనారాయణ చెత్తలో కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు రాత్రి వేళల్లో రోడ్లు శుభ్రం చేసి ఉదయం హాజరు వేసుకునేవారని తెలిపారు. అయితే ఈమధ్య మున్సిపల్ కమిషనర్ ఆ పద్ధతిని...