నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులపై అదనపు భారం
ఈ నెల యూనిట్‌కు 30 పైసలు.. డిసెంబర్ నుంచి 50 పైసలు. హైదరాబాద్ నవంబర్ 04(ప్రజాక్షేత్రం):తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల రూపంలో అదనపు భారం ప్రారంభం కానుంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అనుమతితో 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన అదనపు వ్యయాలను భర్తీ చేసేందుకు ఈ వసూళ్లు చేపడుతున్నారు. మొత్తం రూ.7,635 కోట్లలో రూ.5,420 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మిగిలిన భారాన్ని ప్రభుత్వం భరించనుంది. నవంబర్ నెలలో...