prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 10:27 am Digital Edition : PRAJA KSHETRAM

దేవరకద్ర నియోజకవర్గంలో 9 పిఎసిఎస్ లకు నూతన చైర్మన్లు.

  • ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే జీఎంఆర్!
  • రైతుల సంక్షేమం, సహకార సంఘాల అభివృద్ధికి నూతన చైర్మన్లు కృషి చేయాలి.
  • దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్

దేవరకద్ర నవంబర్ 06(ప్రజాక్షేత్రం):నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్) బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలోని 9 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నూతన చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) నూతనంగా నియమితులైన చైర్మన్లకు ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను అందజేశారు.

నూతనంగా నియమితులైన పిఎసిఎస్ చైర్మన్లు వీరే..

  1. అప్పంపల్లి – ఎస్. వెంకటేష్
  2. భూత్పూర్ – హర్య నాయక్
  3. పోల్కంపల్లి – బండ సురేందర్ రెడ్డి
  4. నాగారం – హెచ్. రాజన్న
  5. ముచ్చింతల్ – మక్తల్ శ్రీనివాస్ రెడ్డి
  6. పామాపురం – ఎన్. బీచుపల్లి యాదవ్
  7. దేవరకద్ర – కే. అరవింద్ రెడ్డి
  8. అడ్డాకుల – గంగుల విజయ మోహన్ రెడ్డి
  9. కొత్తకోట – రావుల జితేందర్ నాథ్ రెడ్డి

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఎమ్మెల్యే జీఎంఆర్‌ను కలిసి తమకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నూతన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు, సహకార సంఘాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని, ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సహకార సంఘాలు గ్రామీణ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలవాలని, రైతుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.