గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.
హైదరాబాద్ నవంబర్ 07(ప్రజాక్షేత్రం):తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీలు వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకునే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా ఆయా గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కొత్త విధానం అక్టోబర్ 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. గతంలో గ్రామ పంచాయతీలు పన్నులు, ఇతర...