ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసిన భీమ్ భరత్ చేవెళ్ల నవంబర్ 08(ప్రజాక్షేత్రం):నవాబ్‌పేట్ మండలం, శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలు, వార్డుల్లో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు జన్మదిన...