కొండకల్లో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
సొంతింట్లో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్న లబ్ధిదారులు శంకర్ పల్లి నవంబర్ 08(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ సొంతింట్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇందిరమ్మ ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపావళి సంబరాలు చేసుకున్నారు. సొంతింటి కల నెరవేరిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి...