prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 4:38 pm Digital Edition : PRAJA KSHETRAM

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు!

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో సహా!

హైదరాబాద్ నవంబర్ 12(ప్రజాక్షేత్రం):తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది రాష్ట్రంలోని 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది, ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుం ది, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ సైతం ఈ బదిలీల లిస్టులో ఉన్నారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1995 బ్యాచ్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ప్రస్తుతం శాంతిభద్రతల ఎల్ అండ్ ఓ విభాగం డీజీపీగా ఉన్న ఆయన, వీసీ సజ్జనార్ స్థానంలో నగర సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సజ్జనార్‌ను అగ్నిమాపక, విపత్తు నిర్వహణ (ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్) డీజీగా బదిలీ చేస్తూ, ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగం డీజీపీగా డా. సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. ఆమెకు ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా బదిలీ కాగా, ఆమెకు హోంగార్డ్స్ అదనపు బాధ్యత లు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు; ఆమెకు సీఐడీ డీజీగా అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. తెలంగాణ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా డా. అనిల్ కుమార్ నియమితు లయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న వై. నాగిరెడ్డిని సివిల్ సప్లైస్ కమిషనర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్, టీజీ-టీఎంఏఆర్ఎస్ డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర, శాంతిభద్రతల (ఎల్ అండ్ ఓ) ఏడీజీపీగా అకున్ సభర్వాల్ నియమితులయ్యారు. అలాగే, మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ (ఐసీసీసీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు), రైల్వేస్ ఐజీగా కే. రమేష్ నాయుడు, మల్టీ జోన్-2 డీఐజీగా నారాయ ణ నాయక్, జోన్-7 (జోగులాంబ) డీఐజీగా జి. చందన దీప్తి (అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్‌గా డి. జోయల్ డేవిస్‌కు బాధ్యతలు అప్పగించారు.