డ్రగ్స్ మహమ్మారిపై మాట్లాడుతుండగా భావోద్వేగానికి లోనైన ప్రధాని మోదీ
దేశ యువతను కాపాడుకోవాలని పిలుపు! న్యూ ఢిల్లీ నవంబర్ 18(ప్రజాక్షేత్రం):దేశంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిపై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఫిలిప్పీన్స్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పాల్గొన్న ఆయన, డ్రగ్స్ వ్యసనం యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గద్గద స్వరంతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. "మన దేశం నుంచి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించగలిగినప్పుడు, డ్రగ్స్ మహమ్మారిని ఎందుకు అంతం...