భైంసాలో దారుణ హత్య భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
కుటుంబ కలహాలే హత్యకు కారణమా? విడాకుల వివాదం నేపథ్యంలో ఘాతుకం.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి. నిందితుడి కోసం పోలీసుల గాలింపు. నిర్మల్ జిల్లా నవంబర్ 20(ప్రజాక్షేత్రం):భైంసా రూరల్, కుటుంబ కలహాలు, దాంపత్య జీవితంలో తలెత్తిన విభేదాలు చివరకు ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భార్యనే భర్త కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన దారుణ ఘటన భైంసా పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని సేవాలాల్ చౌక్ ఆర్ జెడ్ ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం...