మల్కాజిగిరిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును ఢీకొట్టిన ఆటో: ముగ్గురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ నవంబర్ 20(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఒక ఆటో, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేశారు.