రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు అధికారి!

రూ.40 వేలు డిమాండ్.. చివరకు రూ.30 వేలకు బేరం. తండ్రి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుపై మార్చేందుకు లంచం డిమాండ్. హైదరాబాద్, నవంబర్ 20(ప్రజాక్షేత్రం):అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. ఇంటి ఆస్తి మ్యుటేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ యెల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న వార్డు అధికారి డి. రవీందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద ఉన్న పూర్వీకుల ఇంటి ఆస్తిని...