prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 3:20 am Digital Edition : PRAJA KSHETRAM

ఉద్యమకారుల గుర్తింపు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి

  • సంగిశెట్టి క్రిస్టఫర్ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.

వలిగొండ నవంబర్ 20(ప్రజాక్షేత్రం):రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారు లను గుర్తించడంలో కాలయాపన జరుగుతున్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగిశెట్టి క్రిస్టఫర్ విజ్ఞప్తి చేశారు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారు లను గుర్తించడానికి గుర్తింపు కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులను గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని క్రిస్టఫర్ డిమాండ్ చేశారు. ఉద్యమకారులు రోజుకొకరు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారని వెంటనే డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించి అర్హులైనటువంటి ఉద్యమకారులను గుర్తించాలని అన్నారు ఇప్పటికే ఝార్ఖండ్ ఉత్తర్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారు లను గుర్తించి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుందని మరి మన ప్రభుత్వం గుర్తించడంలో ఎందుకు కాలయాపన చేస్తుందో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాపురం శ్రీనివాస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ములుగు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.