prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 2:40 am Digital Edition : PRAJA KSHETRAM

నేడు పెద్దేముల్‌లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటన!

  • రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
  • ఉదయం 11 గంటలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం
  • వెల్లడించిన పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లొంక నర్సింహులు

పెద్దేముల్, నవంబర్ 20 (ప్రజాక్షేత్రం):తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నేడు (శనివారం) పెద్దేముల్ మండలంలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 11 గంటలకు పెద్దేముల్ మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లొంక నర్సింహులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు,యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు,మహిళా కాంగ్రెస్ నాయకులు,ఆయా గ్రామాల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లొంక నర్సింహులు కోరారు.