prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 1:38 am Digital Edition : PRAJA KSHETRAM

రెండోసారి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

  • నియామకంపై ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు

గోదావరిఖని నవంబర్ 20(ప్రజాక్షేత్రం):తనపై నమ్మకంతో రెండోసారి రామగుండం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఠాకూర్ అయోధ్య సింగ్, మనాలి ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ ముస్తఫాతో పాటు పార్టీ నాయకులకు, 25, 26, 27, 28, 29, 30 డివిజన్ల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ కార్పొరేటర్లకు, పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తనకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకుల విశ్వాసాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.