వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
వికారాబాద్ నవంబర్ 23(ప్రజాక్షేత్రం):వికారాబాద్ పట్టణ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం సమీపంలోని ఘాట్ రోడ్డులో లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన జరిగింది. కేరెల్లి వైపు నుంచి వికారాబాద్ వస్తున్న లారీ, వికారాబాద్ నుంచి కేరెల్లి వైపు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామానికి చెందిన నాగేష్, చంద్రమ్మ, సరిత, పార్వతమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.చంద్రమ్మ కాలుకు పట్టీ కట్టించేందుకు వీరంతా కేరెల్లి కి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు...