జన్వాడలో చెరువు భూమికి కబ్జా చెర!
చెరువు భూమిని ఆక్రమిస్తున్నారంటూ గ్రామస్తుల ఆందోళన ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి కబ్జాకు యత్నం? చెరువులో బోర్లు వేసి అక్రమంగా నీటి విక్రయాలు అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయంటూ స్థానికుల ఆరోపణలు శంకర్పల్లి, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని చెరువు భూమి కబ్జాకు గురవుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని చెరువు స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని, చెరువుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకునేందుకు...