నిమ్స్ ఆసుపత్రిలో భారీ అవకతవకలు.. ఏసీబీ తనిఖీల్లో సంచలన విషయాలు!
రూ.5 కోట్ల విలువైన వైద్య పరికరాలు ప్రైవేట్ సంస్థల వద్ద నిల్వ.. చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులు ప్రాసెస్! హైదరాబాద్ నవంబర్ 23(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో టీజీ సేఫ్, డ్రగ్ కంట్రోల్, కార్మిక శాఖ అధికారులతో కలిసి ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో బయటపడిన ముఖ్యమైన అంశాలు: 2019-2025 మధ్య మ్యాన్‌పవర్ నియామకాలు, టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు. ప్రధాన క్యాంటీన్లో...