బిస్లెరీ నీటిపై FSSAI కొరడా.. తాగడానికి సురక్షితం కాదంటూ కేసు నమోదు!

న్యూఢిల్లీ, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు అత్యంత నమ్మకంతో తాగే బిస్లెరీ (Bisleri) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బిస్లెరీ సంస్థ ప్రాంగణం నుండి సేకరించిన నీటి నమూనాలు (Samples) తాగడానికి ఏమాత్రం సురక్షితం కాదని (Unsafe) భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆహార భద్రత చట్టం-2006 కింద బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలు (ప్రాసిక్యూషన్) ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు FSSAI...