మీ హయాంలో ఇచ్చిన జీవోనే.. ఇప్పుడు మాపై ఆరోపణలా?

కోయిల్‌సాగర్ తాగునీటిపై మాజీ ఎమ్మెల్యే ఆలకు ఎమ్మెల్యే జీఎంఆర్ మాస్ కౌంటర్! 2017 అక్టోబర్ 30న జీవో ఇచ్చింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కొత్తగా మేమేం జీవో తీసుకురాలేదు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి! దేవరకద్ర, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):కోయిల్‌సాగర్ తాగునీటి సరఫరాపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే జారీ చేసిన జీవోను ఇప్పుడు తమపై ఆరోపణలకు అస్త్రంగా మార్చుకోవడం విడ్డూరంగా ఉందని స్పష్టం చేశారు. 2017 అక్టోబర్...