- ఇస్కాఫ్ వికారాబాద్ జిల్లా, తాండూరు డివిజన్ నూతన కమిటీల ఎన్నిక
- జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కరణం పురుషోత్తం రావు, అధ్యక్షుడిగా బి. జనార్దన్ రెడ్డి
- తాండూరు డివిజన్ గౌరవ అధ్యక్షుడిగా ఎం.ఏ అలీం ఎన్నిక
పెద్దేముల్, నవంబర్ 23 (ప్రజాక్షేత్రం):దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతి విలువలను కాపాడేందుకు భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కాఫ్) కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది కడారు ప్రభాకర్ రావు అన్నారు. ఈ లక్ష్యాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా, తాండూరు డివిజన్ నూతన కమిటీలను ఆదివారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కడారు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీపీ, సీనియర్ న్యాయవాది కరణం పురుషోత్తం రావు, అధ్యక్షుడిగా అడ్వకేట్ బి. జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం.ఏ. అలీమ్, సాంబూర్ కిషోర్, రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి, కార్యదర్శులుగా కేశవులు, శ్రీనివాస్, సురేష్, పీర్ మహమ్మద్, కోశాధికారిగా గందె మల్లేశం ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మల్లేశం, వెంకటేష్ బాధ్యతలు చేపట్టనున్నారు.అదేవిధంగా తాండూరు డివిజన్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.ఏ. అలీమ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా లెక్చరర్ రాజశేఖర్, శ్రీనివాస్, గందె మల్లేశం, శాంతయ్య, రాంలింగారెడ్డి, మౌలానా, బార్ అసోసియేషన్ కార్యదర్శి అడ్వకేట్ పాశం రవికుమార్, సంజయ్ గౌడ్, కోటం శేఖర్, విజయలక్ష్మి పండిట్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. సుదర్శన్, కార్యదర్శులుగా శివ, జిలాని, కేశవులు, నూరోద్దీన్, బలరాం, అడ్వకేట్ శ్రీనివాస్, కోశాధికారిగా లింగదల్లి రవికుమార్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సుందర్, విఠల్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా కడారు ప్రభాకర్ రావు మాట్లాడుతూ భారతదేశం అనేక మతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని, వాటన్నింటి మధ్య పరస్పర గౌరవం, స్నేహభావం, ఐక్యతను పెంపొందించడమే ఇస్కాఫ్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. గత 85 సంవత్సరాలుగా దేశ ప్రజల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంలో సంఘం విశేష పాత్ర పోషిస్తోందన్నారు. జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నాయకత్వంలో భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం కృషి చేసిందని గుర్తుచేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో పరస్పర విశ్వాసం, మతసామరస్యం, మానవతా విలువలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా హైదరాబాద్లో విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధాలు, విద్వేషాలకు తావులేని శాంతియుత ప్రపంచ నిర్మాణమే ఇస్కాఫ్ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక అధ్యక్షుడు బలరాం, కేశవులు, మల్లేశం తదితరులతో పాటు పలువురు మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, లెక్చరర్లు, యువకులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘం ఆశయాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
