భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య.

కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు నాటకం! మద్యం తాగి గొడవపడుతున్నాడనే కోపంతో హత్య. పోలీసుల విచారణలో వెలుగులోకి నిజాలు. సంగారెడ్డి నవంబర్ 24(ప్రజాక్షేత్రం):భర్త వేధింపులు భరించలేకపోతున్నాననే కోపంతో ఓ భార్య దారుణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసి, విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లు నమ్మించేందుకు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం…కంగ్టి మండలం దెగుల్‌వాడిలో ఈ నెల 10న జరప్ప (46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత విద్యుత్ షాక్‌తో మరణించినట్లు...