prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 5:41 pm Digital Edition : PRAJA KSHETRAM

మరకత శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు.. పోటెత్తిన భక్తులు

  • చెందిప్పలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు.
  • వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులు.
  • ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయం.

శంకర్ పల్లి నవంబర్ 24(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండలం చెందిప్ప గ్రామంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరకత శివలింగాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మరకత శివలింగానికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, విశేష పూజలు చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో దీపారాధన నిర్వహించారు. భక్తులు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో చెందిప్ప గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, దీపారాధన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.