మరకత శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు.. పోటెత్తిన భక్తులు

చెందిప్పలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులు. ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయం. శంకర్ పల్లి నవంబర్ 24(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండలం చెందిప్ప గ్రామంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరకత శివలింగాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మరకత శివలింగానికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు...