📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి

గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి

📰 Generate e-Paper Clip

గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి

ఘటన వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.ఉదయం స్విచ్ ఆన్ చేయగానే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లూరి భూలక్ష్మి గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయారు. ఉదయం ఇంట్లో స్విచ్ ఆన్ చేయగానే.. గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడుతో ఫ్రిజ్‌తో పాటు సిలిండర్ దెబ్బతిని ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భూలక్ష్మికి తీవ్రంగా కాలిన గాయాలు కాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నిజామాబాద్కు తరలించారు.ఇల్లు ధ్వంసం..పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.ప్రస్తుతం బాధితురాలు నిజామాబాద్ ఆస్పత్రి లో చికిత్స పొందుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular