📄 ePaper
Tuesday, February 24, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!

చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!

📰 Generate e-Paper Clip

చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!

డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు

15 రోజులకు మళ్లీ కాల్..రూ.49 లక్షలు మోసపోయిన వైనం

అమరావతి ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):డిజిటల్ అరెస్టు అనేది లేదని, ఆ పేరుతో వచ్చే కాల్సు స్పందించవద్దని పోలీసులు ఆ విశ్రాంత ఉద్యోగికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు. రూ.72.50 లక్షలు బదిలీ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన అతణ్ని ఆపారు. ఎవరైనా ఇబ్బంది పెడితే.. తమను సంప్రదించాలని భరోసా ఇచ్చి మరీ పంపించారు. 15 రోజుల్లోనే మళ్లీ అలాంటి కాల్ రావడంతో ఈసారి ఆ విశ్రాంత ఉద్యోగి భయపడి, మోసగాళ్లకు రూ.49 లక్షలు బదిలీ చేసేశారు. విజయవాడలో స్థిరపడిన స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి (65)కి గత నెలాఖరులో ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ కాల్ వచ్చింది.మీపై కేసులున్నాయని బెదిరించారు. యూనిఫాంలో ఉండి వీడియో కాల్ చేసిన ఓ వ్యక్తి తాను దర్యాప్తు అధికారినని, రూ.72.50 లక్షలు ఇస్తే కేసు మాఫీ చేస్తానని అన్నాడు. దీంతో విశ్రాంత ఉద్యోగి విజయవాడ రామచంద్రనగర్లోని ఎస్బీఐ బ్రాంచికి వెళ్లారు. తన పేరిట ఉన్న రూ.78 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి, అందులో రూ.72.50 లక్షలను మరో ఖాతాకు బదిలీ చేయాలని కోరారు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ ఖాతా నంబరు పరిశీలిస్తే అది కోల్కతాకు చెందినదని తేలింది. దీంతో లావాదేవీ నిలిపేసి, మోసాలపై అవగాహన కల్పించి పంపించారు.

అయినా వినలేదు: తర్వాత విశ్రాంత ఉద్యోగి మళ్లీ
బ్యాంకుకు వచ్చి, తాము బెంగళూరుకు మారిపోతున్నామని చెప్పి.. ఎఫీ క్లోజ్ చేసి, ఆ మొత్తాన్ని తన పొదుపు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. అనంతరం నగరంలోని ఇండియన్ బ్యాంకులో ఖాతా తెరిచారు. అక్కడి నుంచి మోసగాళ్ల ఖాతాకు రూ.49 లక్షలు బదిలీ చేశారు. ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ప్రశ్నించినా.. తెలిసిన వ్యక్తికే పంపిస్తున్నానని చెప్పారు. తీరిగ్గా నాలుగు రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular