నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
– సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్
కొత్తగూడ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలి సంఘం, ల మండల కమిటీల ఆధ్వర్యంలోనిన్న పాకాల కొత్తగూడా ప్రాంతంలో అకాల వర్షం ఈదురు గాలులతో మక్కజొన్న, ఇతర పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్రమైన ఆందోళనకు గురై అపార నష్టం జరిగింది, వాటిని క్షేత్రస్థాయి పరిశీలనకు అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులచే సర్వేలు నిర్వహించి పంట పొలాలను పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే రైతన్ననికి నష్టపరిహారం చెల్లించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
1) అకాల వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న తదితర పంటలకు నష్టపరిహారం చెల్లించాలి.
2) వ్యవసాయ శాఖ అధికారులు మరియు స్థానిక తహసిల్దార్ వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వేలు నిర్వహించాలి
3) రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకొని ప్రకృతి విపత్తుగా భావించి పంట నష్ట పరిహారం ఇవ్వాలి,
పార్టీ నాయకులు కామ్రేడ్ సూర్యం, బూర్కవెంకటన్న, బుర్కబుచ్చి రాములు,మాజీ వైస్ ఎంపీపీ శంకర్, పూర్ణ చందర్, జామ్ల, నిర్మల,రాజేందర్, శ్రీశైలం, శారద, నాగేష్, గుగ్గిళ్ళ వెంకన్న తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు పాల్గొన్నారు.

