పరీక్షల భయం వద్దు… టెలిమానస్ ఉంది
- ఒత్తిడిని జయించేందుకు హెల్ప్‌లైన్ సాయం
- పబ్లిక్ పరీక్షల వేళ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మెడ్చల్–మల్కాజ్గిరి, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):జిల్లాలో కొనసాగుతున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. పరీక్షల ఒత్తిడి, ఆందోళన, భయం వంటి సమస్యలను ఎదుర్కొనే విద్యార్థులకు టెలిమానస్ సేవలను విస్తృతంగా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. విద్యార్థులు ఉచితంగా 14416, 1-800-891-4416 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చని పేర్కొంది. ప్రతి పరీక్షా కేంద్రంలో టెలిమానస్ పోస్టర్లు ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే ప్రత్యక్ష మానసిక ఆరోగ్య సేవలకు రిఫర్ చేసే సదుపాయం కూడా కల్పించారు. ఫలితాల సమయంలో కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున సేవలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ సి. ఉమా గౌరి సూచించారు.

