📄 ePaper
Tuesday, March 24, 2026
ads
📄 ePaper
Homeఆర్టికల్స్అంతరించిపోతున్న సంచార జాతులు…?

అంతరించిపోతున్న సంచార జాతులు…?

📰 Generate e-Paper Clip

అంతరించిపోతున్న సంచార జాతులు…?

సంచార జాతుల జీవితంలో వెలుగెన్నడు…ప్రభుత్వాలు మారిన మారని వారి బతుకులు మాత్రం మారడం లేదు… కులాల గుర్తింపు లేక తమ పిల్లలను చదివించుకోలేక ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్న సంచార జాతులు ఆరోగ్యశ్రీ కూడా నోచుకోవడం లేదు అంతరించిపోతున్న సంచారగాతులపై ప్రత్యేక కథనం…

సమాజంలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారే సంచార జాతుల వారు.తెలంగాణ రాష్ట్రంలో సంచార అర్ధసంచార విముక్త కులాలు మొత్తంగా 42 ఉన్నాయి. తమకంటూ ఒక స్థిర నివాసం లేని ఈ కులాలు బతుకుతెరువు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పలు రాష్ట్రాలకు వలస పోతున్నారు.
సంచారజాతులు పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పట్టణ ప్రాంత శివారులలో చిన్నచిన్న గుడారాలు, గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాయి. ఒక ప్రదేశంలో 15 లేదా 20 రోజులకు మించి ఉండకుండా భుక్తిని వెతుక్కుంటూ నిరంతరం సంచారిస్తారు. పాము, తేలు తదితర మంత్రగాళ్లు, ఆయుర్వేద వైద్యులు, గారడీ చేసేవారు, విన్యాసాలు చేసేవారు, నటులు, కథకులు, జంతు వైద్యులు, పచ్చబొట్లు వేసేవారు, రోళ్లు తయారీదారులు హ, బుట్టల అల్లకం ఇలాంటి పనులతో పాటు యాచక వృత్తిని ప్రధానంగా చేసుకుని జీవనం గడుపుతుంటారు. రవాణా, పరిశ్రమలు, ఉత్పత్తి, వినోదం, పంపిణీ వ్యవస్థలలో తీవ్రమైన మార్పుల కారణంగా వారు తమ జీవనోపాధిని కోల్పోయారు. కలలు అంతరిస్తూ కటిక దుర్భర జీవితంలో సంచార గత బతుకుతున్నారు తమ పిల్లలు చదివించుకోలేక చదువుకుంటున్న పిల్లలకు రెవెన్యూ కార్యాలయంలో కుల సర్టిఫికెట్ ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఏ సంక్షేమ పథకాలు వీరు దరిచెరువు 400 కోట్ల నిధులను కేటాయించామని చేశామని చెప్తున్న ప్రభుత్వాలు అందులో 10 శాతం కూడా ఖర్చు పెట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సంచర జాతులు ఎక్కడ నివసిస్తుంటే అక్కడే వారి ఇల్లు ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. తప్ప అది అమలుకు నోచుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా వీరిపై ప్రణాళికలు ఎలాంటి చెప్పటం లేదు. గతంలో కేంద్రంలో ఉన్న వాజ్పే ప్రభుత్వం సంచార జీతులపై సర్వే నిర్వహించింది. నేటి కేంద్ర ప్రభుత్వం వీరి అన్ని విధాలు ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమె ఇచ్చినందుకు నోచుకోలేదు.

నేరస్తుల ముద్ర వేసిన బ్రిటిషర్లు

నేడు సంచార జాతులుగా వ్యవహరిస్తున్నవారు రాజుల కాలంలో బాగానే బతికేవారు. కథలు వినాలన్నా, తోలుబొమ్మలాటలు చూడాలన్నా, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలన్నా రాజులు సంచార జాతులను పిలిపించుకొని వారిచేత నాటకాలు వేయించుకొని ఉల్లాసాన్ని పొందేవారు. గుళ్లు, ఇళ్లు, చెరువులు, బావులు, కోటలు కట్టేవారు. ఆ రోజుల్లో వీరికి ఎంతో గౌరవం ఉండేదని చరిత్ర చెబుతోంది. అయితే బ్రిటిష్‌ ‌వాళ్ల కాలంలో సంచార జాతులకు కష్టాలువచ్చాయి. ముస్లిం పాలకులు, బ్రిటిష్‌ ‌పాలనా సంస్కరణల్లో భాగంగా రైతాంగం పన్నులు చెల్లించలేక పలు ఇబ్బందులు పడ్డారు. ఆహార ఉత్పత్తిలో అధికభాగం నాటి పాలకులకు శిస్తు రూపంలో చెల్లించేందుకే సరిపోయే. వ్యవసాయ పనులు మందగించి ఎవరికీ పనులు లేకుండా పోయాయి. పనులే ప్రధానంగా గల సంచార జాతులకు పనులు లేకుండా పోయాయి. ఏ గ్రామానికి వెళ్లినా గుప్పెడు అన్నం దొరకని పరిస్థితి. ఆకలికి ఆగలేకపోయేవారు. చిన్న పిల్లల కడపు నిపేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న చిన్న దొంగత నాలు చేయడం మొదలు పెట్టారు. బ్రిటిష్‌ ‌వారు ఇలాంటి వారికి ‘క్రిమినల్‌ ‌ట్రైబ్స్ ’అని పేరు పెట్టారు.

స్థిరపడిన సమాజానికి ‘ముప్పు’ కలిగించే సమూహాల పేరుతో జాబితా చేసి, 1871లో క్రిమినల్‌ ‌ట్రైబ్స్ ‌యాక్ట్ అనే చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా దేశంలో అటువంటివి దాదాపు 200 సంఘాలను నేరస్థులుగా ‘నోటిపై’ చేశారు. ఒకరు, ఇద్దరు దొంగతనాలకు పాల్పడినా సంచార జాతులన్నిటికీ నిందితులుగా పేరు పడిపోయింది. ఇది భరించలేని సంచార జాతుల వారు చాలాసార్లు బ్రిటీష్‌ ‌వారిపై దాడులు చేశారు. పోలీసులు వీరిపై లెక్కలేనన్ని కేసులు పెట్టి వేధించేవారు. చావకొట్టేవారు.

పలువురు సంఘసంస్కర్తల కృషివల్ల, స్వాతంత్య్రం వచ్చాక ‘క్రిమినల్‌ ‌ట్రైబ్స్’ ‌పరిస్థితిపై 1948లో అయ్యంగారి కమిషన్‌ ‌వేశారు. వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆ పేరు (క్రిమినల్‌ ‌ట్రైబ్స్’ ‌మార్చాలని అయ్యంగార్‌ ‌ప్రభుత్వానికి సూచించారు. దాంతో 1952 ఆగస్టు 31న ‘నేరస్తుల జాతుల’ చట్టాన్ని రద్దు చేశారు. వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని పలు వినతులు వచ్చినా నాటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఒప్పుకోలేదు. 1970 దశకంలో లంబాడ, ఎరుకల కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. మిగతా కులాలను వదిలేశారు.1980లో వీరంతా బీసీలు అయిపోయారు.
ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. అనేక కమిటీలు సంచారజాతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేశాయి. 2004లో జస్టిస్‌ ‌మోతిలాల్‌ ‌రాథోడ్‌ అధ్యక్షతన జాతీయ కమిషన్‌ను అప్పటి కేందప్రభుత్వం వేసింది. 2006 లో మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ ‌బాలకృష్ణ రేణకే అధ్యక్షతన రెండో కమిటీని యూపీఏ ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ దేశవ్యాప్తంగా తిరిగి ఆయా జాతుల స్థితిగతులపై అధ్యయనం చేసింది. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు 76 సిఫార్సులతో అప్పటి (2008) ప్రధానమంత్రి మన్మోహన్‌ ‌సింగ్‌కు నివేదిక సమర్పించింది. అయితే ఆ కమిషన్‌ ‌సిఫార్సులను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమైనా సంచార జాతుల జీవనాన్ని మెరుగుపరిచేలా బాలకృష్ణ రేణకే కమిటీ సిఫార్సులను అమలు పర్చాల్సిన అవసర ముంది.
గంగిరెద్దుల, దొమ్మర్ల, పంబల,బాలసంతు, బండార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటికాపరి, కొర్చ, మొండివారు, పిచ్చిగుంట్ల, పాముల, పార్ది, పంబల, దమ్మాలి, వీరముష్టి, గూడల, కంజార, కాప్మారే, మొండిపట్ట, నొక్కార్‌, ‌పరికి, మగ్గుల, యాట, చోపేమారి, కైకాడి, జోషినందివాలా, మందుల, కునపులి, పట్రా, రాజనాల, కాసికపాడి జాతులు, సంచార జాతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి… సంఘం రాష్ట్ర కార్యదర్శి ఒంటెద్దు నరేందర్
సంచార జాతులు మొత్తం 64 కులాలు. ఇందులో బీసీలు 50, ఎస్సీలలో 10, ఎస్టిలో నాలుగు కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలలో కొంత మెరుగుపడిన బీసీల్లో మాత్రం అనేక ఇబ్బంది పడుతున్నారు. వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి చేతివృత్తుల, కలలు అంతరిచిపోతున్నందున చేయడానికి పన్ను లేక అనేక ఇబ్బంది పడుతున్నాము. నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాడినందున మాపై నీరసంగా నాటి ప్రభుత్వ ముద్ర వేసింది స్వతంత్రం వచ్చిన ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

స్థిర నివాసాలు ఏర్పాటు చేసి అందించాలి.

నాటి కెసిఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలించిన ఈ జాతర ఆదుకోలేదు ఈ జాతను ఆదుకోలేదు అంతరించిపోతున్న జాతరను అన్ని విధాలుగా ఆదుకోవాలి 400 కోట్లు కేటాయిస్తున్నామని చెప్తున్నాడు తప్ప ఆ నిధులు ఖర్చు చేయడం లేదు.

ఎం రవీందర్
సీనియర్‌ ‌జర్నలిస్ట్
7901503777
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular