📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఆసిఫాబాద్ పత్తిచేనులో పసికందు…

ఆసిఫాబాద్ పత్తిచేనులో పసికందు…

📰 Generate e-Paper Clip

ఆసిఫాబాద్ పత్తిచేనులో పసికందు…

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మార్చి 22(ప్రజాక్షేత్రం):కాగజ్ నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన శనివారం కలకలం రేపింది. స్థానికులు ఉదయం పత్తి చేను వైపు వెళ్లగా శిశువు అరుపు వినిపించింది, అటు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడకి చేరుకొని చేనులో సంచిలో చుట్టి పడేసి ఉన్న ఆడ శిశువును సురక్షితంగా బయటకు తీసి కాగ జ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. విషయాన్ని బాల సంరక్షణ అధికారి మహేశ్ కి తెలపడంతో సిబ్బందితో ఆయన చేరుకొని ఒక రోజు వయసున్న శిశువును బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. కన్నపేగు బంధాన్ని తెంచుకుని కసాయిగా మారిన తల్లి ఆమె కుటుంబీకులను కర్కశత్వాన్ని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు…

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular