📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeజాతియంఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు..

ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు..

📰 Generate e-Paper Clip

ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు..

నేషనల్ బ్యూరో మార్చి 04(ప్రజాక్షేత్రం):ఉపాధి హామీ కూలీలకు ముఖ్య గమనిక. ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో అక్రమాల జరగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల అమల్లోకి తెచ్చింది. ఇకపై ఉపాధిహామీ కూలీలకు ముఖ హాజరు (ఫేషియల్ అథెంటికేషన్)తప్పనిసరి చేసింది. మార్చి రెండో తేదీ నుంచి (సోమవారం) ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నూతన విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. గతంలో జాబ్ కార్డులో ఒకరి పేరు ఉంటే.. మరొకరు ఉపాధిహామీ పనులకు వెళ్లే పరిస్థితి ఉండేది. అలాగే మస్టర్‌లో దొంగ సంతకాలు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ-కేవైసీ విధానం తీసుకువచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఉపాధిహామీ కూలీకి ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ పూర్తి అయితే అక్రమాలకు పూర్తిగా స్వస్తి పలకవచ్చనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ తీసుకువచ్చింది. 2025 అక్టోబర్‌ నెలలో ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు మెజారిటీ కూలీలకు ఈ ప్రక్రియను పూర్తిచేశారు. మరోవైపు కొత్త విధానం ప్రకారం ఉపాధి హామీ పనికి వెళ్లిన సమయంలో పనులు చేసే ప్రదేశంలో కూలీలకు ఒక ఐడీని క్రియేట్ చేస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్, టీఏలు కూలీలకు మొదట ఫోటో తీస్తారు. పని పూర్తైన నాలుగు గంటల అనంతరం మరోసారి ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీస్తారు. దీంతో పనులు పూర్తి చేసినట్లు సమాచారం అందుతుంది. వీటిలో ఏదీ మర్చిపోయినా ఉపాధి హామీ కూలీలకు బిల్లులు జమకావు. అయితే ఈ విధానం అమల్లో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి.మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్‌ సిగ్నళ్లు సరిగా లేనటువంటి పరిస్థితి. దీంతో ఫేసియల్ రికగ్ని్షన్ విధానం అనేది కష్టతరంగా మారింది. అయితే పని ప్రదేశంలో ఉపాధిహామీ కూలీల ఫొటోలు తీయాలని.. ఆ తర్వాత సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి వెళ్లి యాప్‌లో అప్లోడ్‌ చేయాలని అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచిస్తున్నారు. ఉపాధిహామీ పథకం పనుల్లో పారదర్శకత కోసమే కొత్తగా ముఖ హాజరు విధానం తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ విధానంతో ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందుతాయని.. అలాగే ఉపాధిహామీ పథకం సిబ్బందికి చాలా సమస్యలు తగ్గిపోతాయని చెప్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular