📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణచీకట్లు పోయేలా చిన్నమంగళారంలో ఇప్తార్ విందు

చీకట్లు పోయేలా చిన్నమంగళారంలో ఇప్తార్ విందు

📰 Generate e-Paper Clip

చీకట్లు పోయేలా చిన్నమంగళారంలో ఇప్తార్ విందు

-పండ్లు పంచుకుంటూ పెరిగిన బంధం
మనసులు కలిపిన మధురమైన సందేశం

-మతాలు వేరైనా మనసులు ఒక్కటే అని
చిన్నమంగళారం చెప్పిన గొప్ప సత్యం

-ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షుడు గన్నేపాగ నర్సింగ్ రావు వెల్లడి

మొయినాబాద్ మార్చి 19(ప్రజాక్షేత్రం):రంజాన్ పర్వదినం సందర్భంగా మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షుడు గన్నేపాగ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇప్తార్ విందు ఆత్మీయత, సోదరభావంతో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు గ్రామ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామాజిక ఐక్యతను ప్రతిబింబించారు. ఇఫ్తార్ సమయంలో పాల్గొన్నవారు ఒకరికి ఒకరు పండ్లు తినిపించుకుంటూ ప్రేమ, పరస్పర గౌరవాన్ని చాటుకున్నారు. కార్యక్రమం అంతటా స్నేహపూర్వక వాతావరణం నెలకొని అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గన్నేపాగ నర్సింగ్ రావు మాట్లాడుతూ, రంజాన్ మాసం కేవలం ఉపవాసానికి మాత్రమే కాకుండా సహనం, దాతృత్వం, మనుషుల మధ్య ప్రేమను పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సోదరభావంతో జీవించడం ద్వారా శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనుషుల మధ్య దూరాలను తొలగించి, హృదయాలను దగ్గర చేసే వేదికలుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మతాలు వేరైనా మనసులు ఒక్కటే అని, చీకట్లు తొలగి పోయేలా చిన్నమంగళారంలో ఇప్తార్ విందు జరిగిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ విందును అభినందిస్తూ, ఇలాంటి ఐక్యతా కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular