📄 ePaper
Tuesday, March 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణజిల్లాలో ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ:జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి.

జిల్లాలో ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ:జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి.

📰 Generate e-Paper Clip

జిల్లాలో ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ….

-ప్రజావాణి ఫిర్యాదులకు వేగవంత పరిష్కారం ఇవ్వాలి.

-జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి.

వనపర్తి, మార్చి 23 (ప్రజాక్షేత్రం):జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారి కరుణాకర్‌కు ప్రత్యేకంగా సూచనలు చేశారు. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నమూనాలను తరచుగా సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని విద్యాసంస్థలు, హాస్టళ్లు, కేజీబీవీలలో ఆహార నిల్వలు, వండిన ఆహారాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపాలని ఆదేశించారు. అలాగే ఆహారం తయారు చేసే అన్ని సంస్థలు తప్పనిసరిగా ఫస్సయి లో ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని, ఫాస్కోస్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు ఉన్నప్పటికీ, గృహ వినియోగ సిలిండర్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొంత కోత ఉందన్నారు. ప్రజలు అనవసరంగా భయపడకుండా అవసరమైనప్పుడు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత మాత్రమే తిరిగి సిలిండర్ బుక్ చేసుకోవాలని తెలిపారు.


-ఫిర్యాదులను పరిష్కరించాలి.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈవో యాదయ్యలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 29 అర్జీలు అందాయని తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సీఎం, జిల్లా మంత్రి స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను కూడా వారం రోజుల్లో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular