హైదరాబాద్ మార్చి 09(ప్రజాక్షేత్రం):జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో తాను ఒక ‘బాంబు’ పేల్చబోతున్నానని చెప్పారు. గతంలో స్వచ్ఛమైన సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బతికేవారని, కానీ ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని ఆయన అన్నారు. శాస్త్రీయంగా చూస్తే సారా ఆరోగ్యానికి హానికరం కాదని ఆయన వాదించారు. అసలు తెలంగాణలో సారాను ఎందుకు నిషేధించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘జీరో అవర్’లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని, సారా దుకాణాలను మళ్లీ తెరవాలని కోరతాననని చెప్పారు. మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలను నడుపుతున్నాయని, అదే తరహాలో తెలంగాణలో కూడా ఎందుకు అమలు చేయకూడదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో సారా దుకాణాలను తెరవాలి:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
0
42
Previous article
- Advertisment -ads

