📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ప్రపంచకప్ సంబరాల్లో బాణసంచా ప్రమాదం.. ఇంట్లో అగ్నిప్రమాదం

ప్రపంచకప్ సంబరాల్లో బాణసంచా ప్రమాదం.. ఇంట్లో అగ్నిప్రమాదం

📰 Generate e-Paper Clip

ప్రపంచకప్ సంబరాల్లో బాణసంచా ప్రమాదం.. ఇంట్లో అగ్నిప్రమాదం

కుకట్ పల్లి మార్చి 8(ప్రజాక్షేత్రం):ప్రపంచకప్ క్రికెట్ సంబరాలు ప్రమాదానికి దారితీశాయి. కుకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నం.3లో ఆదివారం రాత్రి బాణసంచా కారణంగా ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న శివాలయం ఆవరణలో యువకులు బాణసంచా కాలుస్తుండగా వాటిలో ఒకటి సమీపంలోని ఇంటిలోపల పడింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగి కొంత సామగ్రి దగ్ధమైంది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై నీటితో ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular