📄 ePaper
Tuesday, March 24, 2026
ads
📄 ePaper
Homeజాతియంమతం మారితే.. ఎస్సీ హోదా రద్దు

మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు

📰 Generate e-Paper Clip

మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు

  • రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదు
  • గుంటూరు పాస్టర్ కేసులో కీలక వాదనలు
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదన్న న్యాయస్థానం
  • ఏపీ హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం ధర్మాసనం
  • మతం మార్పుపై సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

అమరావతి, మార్చి 24(ప్రజాక్షేత్రం):క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తేల్చిచెప్పింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజా రియాతో కూడిన ధర్మసనం ఈ మేరకు తీ తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమ ర్థించింది. వివరాలలోకి వెళితే.. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడు దశాబ్ద కాలంగా పాస్టర్ ఉంటున్నారని, ఘటన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని పేర్కొంది.

మతం మారితే ఎస్సీ హోదా దక్కదు..

ఫిర్యాదుదారుడికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సుప్రీంకోర్టు వెల్లడిం చింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరని స్పష్టం చేసింది. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద రక్షణ లభించదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular