📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా!

రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా!

📰 Generate e-Paper Clip

రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా!

అజీజ్‌నగర్‌ ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ,

కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు..?

హైదరాబాద్ మార్చి 17(ప్రజాక్షేత్రం):మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన అజీజ్‌నగర్‌ ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ, కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విందులో వాడిన కొకైన్‌ ఎవరు సరఫరా చేశారు..? ఎంత కాలం నుంచి ఇక్కడ డ్రగ్స్‌ పార్టీలు జరుగుతున్నాయి..? ఎప్పుడెప్పుడు జరిగాయి? ఎవరెవరు వస్తుంటారు..? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత ఇక్కడ పలుసార్లు విందులు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తాజా ఘటన నేపథ్యంలో నిశిత పరిశీలన చేస్తున్నారు.

ఫాంహౌస్‌లో పార్టీలు…

నెలలో రెండు, మూడుసార్లు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో పార్టీలు నిర్వహిస్తుంటారని తెలుస్తోంది. అప్పుడప్పుడు తప్ప ప్రతిసారీ కొత్త వ్యక్తులే వస్తారనే ప్రచారం ఉంది. ఇలా ఇప్పటివరకు వచి్చనవారిపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. పార్టీలో విదేశీ మద్యం, గాంజా, డ్రగ్స్‌ వినియోగించారా? ఎక్కడినుంచి వచ్చాయి. ఎవరు తెచ్చారు. ఎవరెవరు తీసుకున్నారు? అనే వివరాలను రాబడుతున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్‌ పార్టీ, కాల్పుల తర్వాత ఎవరెవరు వచ్చారనేది తెలుసుకునేందుకు గస్తీ కాస్తున్నారు. ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular