📄 ePaper
Tuesday, March 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణలాకప్ డెత్ కేసులో 10 డిమాండ్లు – డీజీపీతో మంద కృష్ణ మాదిగ భేటీ

లాకప్ డెత్ కేసులో 10 డిమాండ్లు – డీజీపీతో మంద కృష్ణ మాదిగ భేటీ

📰 Generate e-Paper Clip

లాకప్ డెత్ కేసులో 10 డిమాండ్లు – డీజీపీతో మంద కృష్ణ మాదిగ భేటీ

హైదరాబాద్ మార్చి 24(ప్రజాక్షేత్రం):కర్ల రాజేష్ లాకప్ డెత్ కు ప్రధాన కారకుడు, చిలుకూరు పోలీస్ స్టేషన్ కు అధికారిగా ఉన్న సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి. ప్రస్తుతం కర్ల రాజేష్ లాకప్ డెత్ పై కొనసాగుతున్నటువంటి విచారణను వేగవంతం చేసి తక్షణమే దర్యాప్తును పూర్తి చేయాలి. కర్ల రాజేష్ మృతదేహం ఇంటి వద్ద ఉండగానే తేది 18-11-2025 రోజున రాజేష్ మరణానికి కారకులైన ఎస్ఐ, సీఐల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఆనాటి కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి కి కర్ల రాజేష్ తల్లిగారైన కర్ల లలిత ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తీసుకోకుండా మీరు రాసుకొని వచ్చిన పిర్యాదు కాకుండా నేను సూచించిన విధంగానే ఫిర్యాదు రాయాలని, లేకుంటే పిర్యాదు తీసుకోనని కర్ల లలిత ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించి విధి నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం చేశారు. కోదాడ నూతన డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి కి తేది 30-11-2025 న కర్ల లలిత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దానిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇద్దరు డీఎస్పీలు నిర్లక్ష్యం చేసిన తరువాత తేది:- 9-12-2025 రోజున సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహా కి కర్ల లలితమ్మ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసు అధికారులపై (కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అలాగే సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహా ) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లోని సెక్షన్ 4 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular