శ్రీనివాసరెడ్డి సేవలు చిరస్మరణీయం…
– ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ముందుకు సాగుదాం.
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
– మాజీ పార్లమెంటు సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి.
వనపర్తి, మార్చి 23(ప్రజాక్షేత్రం):పెద్దమందడి మండలానికి చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు విట్టా శ్రీనివాసరెడ్డి సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగడం మనందరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన శ్రీనివాసరెడ్డి ఏకాదశ దినకర్మ కార్యక్రమం సోమవారం ఆయన స్వగ్రామం అమ్మపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు శ్రీనివాసరెడ్డి ప్రజల పట్ల చూపిన సేవాభావం, సామాజిక బాధ్యత ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం, మండల ప్రగతికి ఆయన చేసిన కృషి మరువలేనిదని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి జ్ఞాపకాలను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో గ్రామస్థులు, మండల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

