సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి ఆహ్వానం..
నాగర్ కర్నూల్ జిల్లా మార్చి 01(ప్రజాక్షేత్రం): టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఈ జంట తమ సొంత గ్రామంలో రిసెప్షన్ వేడుకలు గ్రాండ్‌గా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. రిసెప్షన్ వేడుకల నేపథ్యంలో నటి రష్మిక మందన్న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు రష్మిక. ఈ నెల 4వ తేదీన తుమ్మన్‌పేట ఫామ్‌హౌస్‌లో రిసెప్షన్, సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సతీమణి రష్మిక మందన్నకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి, కానుక ఇచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు రష్మికను దీవించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ నటి రష్మిక తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు’ అంటూ ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి దంపతులను సగౌరవంగా ఆహ్వానించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా, 4న తుమ్మన్ పేట ఫామ్ హౌస్ కు చేరుకోనున్న విజయ్ దేవరకొండ- రష్మిక జంట. రిసెప్షన్ వేడుకలకు సెలబ్రెటీలు, రాజకీయ నేతకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సమాచారం. ముఖ్యమంత్రి దంపతులను సగౌరవంగా ఆహ్వానించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

