కీడు సోకిందని ఊరు ఖాళీచేసిన గ్రామస్తులు
జమ్మికుంట మార్చి 23(ప్రజాక్షేత్రం):జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడంతో గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రామానికి ఏదో కీడుసోకిందని బలంగా నమ్మిన గ్రామస్తులు, పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజంతా గ్రామస్తులు ఊరు మొత్తం ఖాళీ చేసి వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం సోమవారం తెల్లవారు జామునే ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలో డప్పు చాటింపు వేయించి మరీ ఊరి బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన (కీడు) పీడ విరుగడవుతుందని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

