షాద్ నగర్ లో కట్టప్ప..!?
– వెన్నుపోట్లు పొడిచింది ఎలా..?
– మున్సిపల్ ఎన్నికల్లో కట్టప్ప పాత్ర పై దుమ్మెత్తి పోస్తున్న వర్గాలు
– ఆ పార్టీలో కట్టప్ప పై చర్చ
షాద్ నగర్ ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):రాజకీయాల్లో వెన్నుపోటు మోసాలు సర్వసాధారణమే.
కానీ ఈ రీతిలో వెన్నుపోట్లకు తిరతీయడం ఎక్కడ చూడలేదని రేపు తమకు టైం వస్తుందని తాము కూడా వెన్నుపోట్లు పొడవడానికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలువురు అంటున్నారు. షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది ముఖ్య నాయకుల ఓటమిపై కట్టప్ప పాత్ర ఉంది అంటూ కొందరు బాధితులు అంటున్నారు. తన వారిని గెలిపించుకోవడం ధర్మమే కానీ తన పార్టీ కాని వారిని కూడా టార్గెట్ చేసి ఓడించడం ఒక పద్ధతి అయితే సొంత పార్టీలో తనకు గిట్టని వారిని కూడా ఓడించేందుకు ఆర్థిక సహకారం ఎలక్షన్ ఫండ్ సమకూర్చిన కట్టప్పపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. ఎవరు కట్టప్ప ఏమిటా కట్టప్ప చరిత్ర తెలుసుకునే ముందు ఎన్నికల్లో కొందరి ఓటమికి కొందరికి గెలుపుకు పరోక్ష కారణంగా కట్టప్ప నిలిచాడని బాధితులు అంటున్నారు. తమ టార్గెట్ ఫినిష్ చేసుకునేందుకు ఎవరెవరిని ఓడించాలి ఎవరెవరిని బరిలోదించాలి ఎవరికి ఆర్థిక సహకారం అందించాలి అన్ని ఒక పద్ధతి ప్రకారం గోడ కట్టినట్టు అతి జాగ్రత్తగా జరిగిన నాటకీయ పరిణామాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయని సదరు పార్టీలో చర్చ మొదలైంది. ఓ వార్డులో ఎవరికి తెలియకుండా తన పార్టీ వ్యక్తి కాకుండా ఇతర పార్టీ వ్యక్తిని ప్రోత్సహించి తన టార్గెట్ రీచ్ కావడం కోసం ఫండ్ చేసినట్టు సమాచారం.
అదేవిధంగా తన అనుచరులు తన కావలసినవారు అనే నిబంధన మరికొందరికి ఫండ్ చేసి పార్టీ అగ్ర నాయకులు అవునన్నా కాదన్న తన శైలి తాను వహించడం పట్ల సదర్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ వార్డులో తన అనుచరుడికి ఫండింగ్ చేసిన కట్టప్ప అదే వార్డులో తన పార్టీకి చెందిన అభ్యర్థిని ఓడించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరు కట్టప్ప ఏమిటి చరిత్ర ఇంకా ఎన్నికల్లో చాలా ఉంది. గత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో పార్టీకి అంటి ముట్టనట్లు నియోజకవర్గ దూరంగా ఉన్నా కట్టప్ప ఇప్పుడు మరో రూపంలో తన కావలసిన వారి కోసం తలవారిని తన పార్టీ రెబల్ ను సైతం గెలిపించుకునేందుకు ఫండింగ్ ఇచ్చారని సదరు పార్టీలో తలలు పట్టుకుంటున్నారు. అధిష్టానం వద్దన్నా పార్టీ పెద్దలు కాదన్న తన ఉనికిని కాపాడుకునేందుకు కరెక్ట్ కాదని మరికొందరంటున్నారు.. KP

