📄 ePaper
Saturday, May 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ మాదిగల నమ్మక ద్రోహి:మంద కృష్ణ మాదిగ

కాంగ్రెస్ పార్టీ మాదిగల నమ్మక ద్రోహి:మంద కృష్ణ మాదిగ

📰 Generate e-Paper Clip

– రేవంత్ రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం.

– మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్ మార్చి 05(ప్రజాక్షేత్రం):రాజ్యసభ సీట్ల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా గల మాదిగలకి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మాదిగ జాతికి నమ్మకద్రోహం చేశాడని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాదిగ జాతికి మరింత అన్యాయం జరుగుతుందని గత కాంగ్రెస్ హయాంలో జరగనంత తీవ్ర అన్యాయం రేవంత్ రెడ్డి హయాంలోనె జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఎస్సీ రిజర్వ్ డ్ లోక్ సభ స్థానాలు ఉన్న తెలంగాణలో ఒకటి కూడా మాదిగలకు కేటాయించకుండా అన్యాయం చేశాడని, ఈ మధ్యకాలంలో ఐదు ఎమ్మెల్సీలు భర్తీ చేస్తే ఎస్సీలలోని మాల సామాజిక వర్గానికి ఇచ్చి ఎస్టీలకు ఒకటి ఇచ్చి మాదిగలకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నాడు. ఇప్పుడు రాజ్యసభ సీట్లలో ఇవ్వకుండా మాదిగ జాతికి ద్రోహం చేశాడని మండిపడ్డారు. ఇప్పటికే క్యాబినెట్ హోదా కలిగి ముఖ్యమంత్రి తర్వాత షాడో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తన మిత్రుడైన తన కులమైన వేం నరేందర్ రెడ్డి కి ఇచ్చిండు కానీ తనను నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మాదిగ వ్యక్తులకు ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియలో 15 లక్షల జనాభా ఉన్న మాలలకు ఐదు శాతం కేటాయించినప్పుడు 33 లక్షలన్న మాదిగలకు 11 శాతం కేటాయించకుండా తొమ్మిది శాతమే ఇచ్చి అన్యాయం చేశారని అదేవిధంగా గత నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తానని నిండు అసెంబ్లీలో మాట ఇచ్చి వర్గీకరణ అమలు చేయకుండా టీచర్ పోస్టుల భర్తీ నియామక పత్రాలు ఇచ్చి, గ్రూప్ వన్, గ్రూప్ టు,గ్రూప్ త్రీ సంబంధించిన పోస్టులలో వర్గీకరణ లేకుండా భర్తీ చేసి వేలాదిమంది మాదిగ నిరుద్యోగులకన్యాయం చేశాడని అన్నారు. పార్లమెంట్లో మాదిగలకు ప్రాతినిధ్యం లేని సందర్భం ఈ రేవంత్ రెడ్డి హాయంలోనేనని ఏ ప్రభుత్వాలలో కూడా ఇంత అన్యాయం జరగలేదని అన్నారు. కర్ల రాజేష్ ఘటనలో గత 110 రోజులుగా ఉద్యమిస్తుంటే హోం శాఖను రాజంపేట ఉంచుకున్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కర్ల రాజేష్ ఘటనపై స్పందించలేదని నిన్ను తొడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుతున్నారని అన్నారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో పది రోజుల్లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి పోలీసులను డిస్మిస్ చేసి ఆ కుటుంబానికి 35 లక్షల ఎక్సప్రెస్ ప్రకటించి న్యాయం చేశారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో 110 రోజులైనా కూడా ఇంకా ముఖ్యమంత్రి స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పోలీసులు, పోలీస్ అధికారులు ప్రభుత్వ పాలకుల మాట విని వారి కనుగుణంగా ప్రజలను చిత్రహింసలు పెట్టరాదని, ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకోరాదని మీ డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించాలని సూచన చేశారు. అగ్రకుల పాలకుల మాటలు విని వారి ఆదేశాలను పాటిస్తే మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడారని మిమ్మల్ని బలి పశువులను చేస్తారని అన్నారు. రాజ్యసభ సీట్లలో మాదిగలకు ఒకటి కూడా ఇవ్వకుండా ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా ఈనెల 13 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల ముందు నల్లజెండాలతో నిరసన కార్యక్రమం ఎమ్మార్పీఎస్పీ అనుబంధ సంఘాల నాయకులతో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీలలో విద్యాసంస్థల వద్ద మాదిగ విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు ఉన్నట్లు కార్యాచరణ ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login