📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకొంపల్లి–దూలపల్లిలో నామమాత్రపు కూల్చివేతలు…టౌన్ ప్లానింగ్ పై స్థానికుల ఆగ్రహం

కొంపల్లి–దూలపల్లిలో నామమాత్రపు కూల్చివేతలు…టౌన్ ప్లానింగ్ పై స్థానికుల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

కొంపల్లి–దూలపల్లిలో నామమాత్రపు కూల్చివేతలు…టౌన్ ప్లానింగ్ పై స్థానికుల ఆగ్రహం

చిన్న షెడ్లపై ప్రతాపం…భారీ అక్రమ నిర్మాణాలపై మౌనం?

కూల్చామా అన్నట్టే కూల్చివేతలు…అధికారుల తీరుపై అనుమానాలు?

కుత్బుల్లాపూర్, మార్చి 09(ప్రజాక్షేత్రం):కొంపల్లి సర్కిల్ పరిధిలోని కొంపల్లి మరియు దూలపల్లి ప్రాంతాల్లో సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు కొన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టినప్పటికీ, అవి కేవలం నామమాత్రపు కూల్చివేతలుగా మాత్రమే మిగిలిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, కళ్లముందే భారీగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా, చిన్నచిన్న షెడ్లను మాత్రమే కూల్చి వెళ్లిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా నామమాత్రపు కూల్చివేతల వల్ల అక్రమ నిర్మాణాలు ఎలా ఆగుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా దూలపల్లి న్యూ స్టీల్ సిటీ ప్రాంతంలో భారీ షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పటికీ, టౌన్ ప్లానింగ్ అధికారులు దానిపై చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంత పెద్ద నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయా? సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మాణం ఎలా చేపట్టారు? అనుమతులు ఉంటే ఎలా మంజూరు అయ్యాయి? అనే ప్రశ్నలు స్థానికుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు నిజంగా అక్రమంగా ఉన్న నిర్మాణాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద నిర్మాణాలను వదిలేసి చిన్న షెడ్లపై మాత్రమే ప్రతాపం చూపించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై సమగ్రంగా చర్యలు తీసుకుంటేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular