📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణలో గ్యాస్ కొరత లేదు, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రం ఉంది:మంత్రి ఉత్తమ్

తెలంగాణలో గ్యాస్ కొరత లేదు, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రం ఉంది:మంత్రి ఉత్తమ్

📰 Generate e-Paper Clip

తెలంగాణలో గ్యాస్ కొరత లేదు, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రం ఉంది:మంత్రి ఉత్తమ్

  • గ్యాస్ కొరతపై చమురు రంగ కంపెనీలతో సమీక్ష జరుపుతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ
  • డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్ మార్చి 12(ప్రజాక్షేత్రం):తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని, కేవలం వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రమే ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్యాస్ కొరతపై శుక్రవారం చమురు రంగ కంపెనీలతో సమీక్షిస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందిపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా మన రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌ను తీసుకురావడం లేదని విమర్శించారు. మున్ముందు ఎరువుల కొరత కూడా ఏర్పడే అవకాశముందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటోందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular